మీ ఇంట్లో పిల్లలున్నారా.. అయితే సీజనల్ గా వచ్చే వ్యాధులను నిరోధించడానికి ఈ మొక్క తప్పనిసరిగా మీ ఇంట్లో ఉండాల్సిందే..ఎన్నో వ్యాధులకు చక్కని దివ్య ఔషధంగా పనిచేసే ఈ మొక్క ఏమిటి అనుకుంటున్నారా అదే వామాకు లేదా కర్పూరవల్లి. భారతీయుల వంటిల్లే ఓ ఆయుర్వేద ఔషధాల యొక్క గని. పోపుల పెట్టెలో ఉండే ఎన్నో పదార్ధాలు అనేక అనారోగ్యాలను మూలాల నుంచి నివారిస్తాయి. ప్రతి ఇంట్లో ఉండాల్సినవి వాము గింజలు అయితే ప్రతి ఇంటి పెరట్లో కచ్చితంగా ఉండవలసిన మొక్కలలో వామాకు ఒకటి. ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్నవారు ఈ వామాకు మొక్కలు పెంచుకోవడంతో ఎన్నో సమస్యలు నుంచి ఈజీగా బయటపడవచ్చు.
ఇక వామాకు వంటకాలతో పాటు పలురకాల డ్రింక్స్లు తయారీకోసం ఉపయోగిస్తారు. వామాకు ఘాటుగా ఉండే చక్కని సువాసనను అందిస్తుంది. వాములోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ప్రోటీన్స్ వంటి ఖనిజాలు, పోషకాలు శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాము గింజలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అదేవిధంగా వాము మొక్క ఆకులు అంతే మేలు చేస్తాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. అందుకనే కనీసం మూడు నెలలకు ఒక్కసారి అయినా వాము పొడి కాని వాము ఆకు రసం కాని వాడితే కడుపు మొత్తం శుభ్ర పడుతుంది. వాము ఆకు అప్పుడప్పుడు నివారణ చిట్కాగా వాడితే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు చెప్పారు. ఈ వామాకులో విశిష్ట వైద్య లక్షణాలు ఉన్నాయి.
వాము ఆకు ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
*చిన్న పిల్లలకు అజీర్తితో కడుపునొప్పి, వికారం, వాంతులుకి వాము ఆకు మంచి ఔషధం. వాము ఆకు రసంలో కొంచెం తేనె కలిపి చిన్న పిల్లలకు అరచెంచా ఇస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇక తరచుగా చిన్న పిల్లలు దగ్గు, జలుబు, ఇన్ఫెక్షన్స్ వంటివి వాటితో ఇబ్బంది పడుతుంటే.. వాము ఆకు మరిగించిన నీరు మంచి మెడిసిన్.
*ఈ ఆకుల రసం కాలిన గాయాలు, మచ్చలను తగ్గిస్తుంది. దీనిలో ఉండే యాంటీ సెప్టిక్ గుణాలు గాయాలు, మచ్చలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
*వామాకు తలనొప్పి తగ్గించడంలో కూడా ఔషధంగా పనిచేస్తుంది. వాము ఆకును దంచి తీసిన రసాన్ని తలనొప్పి ఉన్న చోట రాస్తే త్వరగా తగ్గుతుంది. దీనిలో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వలన శరీరంలో అన్ని రకాల నొప్పులను నయం చేస్తుంది.
*ఏవైనా పురుగులు, కీటకాలు శరీరంపై కుడితే వాము ఆకును రుద్దినా విషం బయటకుపోతుంది. లేదా ఆకులు దంచి కట్టుకట్టాలి.
*వాము ఆకులను నమిలితే జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. పిల్లలకు కడుపు నొప్పి వంటివి తగ్గుతాయి.
ఈ వాముకలని ఔషధంగానే కాదు ఆహారపదార్ధాల్లో వాసన, రుచి కూడా ఉపయోగించవచ్చు. వాము ఆకుతో బజ్జీలు, పకోడీలు వేసుకొని తినవచ్చు.. వాము ఆకుతో పెరుగు పచ్చడి చేసుకుని తింటే రుచికరంగా ఉండడంతో పాటు అజీర్తి సమస్యలు కూడా దూరమవుతాయి.. అలాగే వాము ఆకుతో చారు రసం కూడా పెట్టుకోవచ్చు.. ప్రతి ఇంటి పెరట్లో వాము మొక్క ఉంటే కీటకాలను రాకుండా చేస్తుంది. పిల్లలతో పాటు పెద్దలకు కూడా అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది.