walnuts good for brain

మెదడు కణం కణం లోకి వెళ్లి యాక్టీవ్ చేస్తుంది

వాల్ నట్స్ చూడడానికి మన మెదడు ఆకారంలోనే ఉంటుంది.  వాల్నట్స్ కి  మెదడుకి చాలా దగ్గర అవినాభావ సంబంధం ఉంటుంది.   వాల్ నట్స్ బ్రెయిన్ డెవలప్మెంట్ కు కావలసిన నెంబర్ వన్ సోర్స్. ఈ విషయం అనేక  పరిశోధనల  ద్వారా నిరూపించబడింది. చిన్నపిల్లలకి సంవత్సరం  నర నుండి పెట్టడం మొదలు పెడితే  వాళ్లకి నాలుగు లేదా ఐదు సంవత్సరాలు వచ్చే సరికి బ్రెయిన్ డెవలప్మెంట్ బాగా జరగడానికి చాలా బాగా  ఉపయోగపడతాయి. పిల్లలకు  బ్రెయిన్ డెవలప్మెంట్ 2, 3 ఏళ్ల వయసులోనే  బాగా జరుగుతుంది.

కాబట్టి ఆ సమయంలో పిల్లలకు  వాల్ నట్స్ తినిపించడం చాలా అవసరం. పిల్లలకైనా, పెద్దలకైనా , ముసలి వారికైనా  బ్రెయిన్ సెల్స్ ఆరోగ్యంగా ఉండాలి అంటే వాల్ నట్స్ తినడం మంచిది.వాల్ నట్స్ ఎందుకు అంత ముఖ్యం అంటే వాటిలో  ఒమేగా 3 ఫాటీ ఆసిడ్స్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది.   100 గ్రాముల వాల్ నట్స్ లో 9 గ్రాముల  ఫాటీ ఆసిడ్స్  ఉంటాయి. మనకి రోజుకి 1.1 గ్రాము ఫాటీ ఆసిడ్ సరిపోతుంది.  అంటే మనం రోజుకి 5-10 వాల్ నట్స్ తింటే సరిపోతుంది. 

శరీరంలోకి వెళ్లిన తర్వాత ఫాటీ ఆసిడ్ DHA గా కన్వెర్ట్ అవుతుంది. ఈ DHA గా  కన్వర్ట్ అయినప్పుడు బ్రెయిన్  సెల్ కి బ్రెయిన్ సెల్ కి మధ్య అలాగే నెర్వ్ సెల్ కి మధ్యలో కనెక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది.  బ్రెయిన్ సెల్  లైఫ్ టైం  150 సంవత్సరాలు   బ్రెయిన్ సెల్స్  కుసించుకుపోకుండా   ఎక్కువకాలం జ్ఞాపకశక్తి  బాగా  అందించేటట్లు ఒమేగా  3 బాగా ఉపయోగపడుతుంది. ఒమెగా త్రీ తోపాటు వాల్నట్స్ స్పెషల్ ఫాలీ ఫినాల్స్ ఉంటాయి.  పాలీఫినాల్స్  మనం ఆలోచించేటప్పుడు విడుదలయ్యే  ఫ్రీ రాడికల్స్ను బ్రెయిన్ సెల్స్ ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి. 

క్లియర్ చేసుకోకపోతే బ్రెయిన్ సెల్స్ లైఫ్ టైం  తగ్గిపోతుంది. స్పెషల్ పాలిఫినాల్స్   బ్రెయిన్ సెల్స్ లో ఉండే ఫ్రీరాడికల్స్ను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తాయి.  బ్రెయిన్ సెల్స్ కి ఒత్తిడి  తగ్గిపోయి  బ్రెయిన్  సెల్ కి బ్రెయిన్ సెల్ కి మధ్య కనెక్షన్ ఇంప్రూవ్ అవుతుంది.  దీనివల్ల బ్రెయిన్ సెల్స్  బాగా పని చేస్తాయి.  బ్రెయిన్ కి కణాలకి లింక్ కూడా బాగుండి  శరీరంలో అన్ని అవయవాలు బాగా పని చేస్తాయి. బ్రెయిన్  బ్రెయిన్ సెల్స్ మధ్య సంబంధాలు బాగుంటే  శరీరంలో జరగాల్సిన అన్ని క్రియలు సరిగా జరుగుతాయి.

మెదడుకి  కావలసిన మేత వాల్ నట్స్ కాబట్టి ప్రతి ఇంట్లోనూ వాల్ నట్స్ ను తెచ్చి పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. అలాగే  అన్ని వయసుల వారు తినడం కూడా అలవాటు చేసుకోవాలి.

Leave a Comment

error: Content is protected !!