we should not donate thest items to visitors

ఇంటికి వచ్చిన వారికి పొరపాటున కూడా వీటిని దానంగా ఇవ్వకండి..

అన్ని దానాలలో కెల్లా అన్న దానం గొప్పది అంటారు. అలాగే దానం ఇవ్వకూడని వస్తువులు కూడా కొన్ని ఉన్నాయి. ఎవరికైనా అవసరంలో ఉన్నప్పుడు అడిగినా, అడగకపోయినా తెలుసుకొని సహాయం చేయడాన్ని దానం అంటారు. ఇలా దానం ఇచ్చే వారిని దాత అని , తీసుకునే వారిని యాచకుడు లేదా అర్హత కలవాడు అని అంటారు. చాలా వరకు దానాల్లో అన్నదానం, వస్త్రదానం ఇంకా పండితులు అయితే గోదానం, భూదానం అంటూ చాలా రకాలు ఉంటాయి. ఇలా దానం ఇవ్వడం వలన మనకు ఉన్న దోషాలు పోయి కీర్తి ప్రతిష్టలు, అష్టైశ్వర్యాలతో ఉంటారని నమ్ముతారు.

 కొంతమంది సేవాభావంతో తనకు తోచిన దానాలు చేస్తూ ఉంటారు. ఇలాంటి సేవ, డబ్బులు, వస్త్రాలు లేదా వారికి కావలసిన సహాయం చేయడం అయి ఉంటుంది. వీటివలన ఎప్పుడూ మంచి జరుగుతుంది. కానీ చాలామంది తెలియక కొన్ని వస్తువులను దానంగా ఇస్తుంటారు. అలా ఇవ్వడం వలన దరిద్రం పట్టుకుంటుందని నమ్ముతారు. అలా ఇవ్వకూడని వస్తువులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

 ప్లాస్టిక్ వస్తువులు: చాలాసార్లు ఏమైనా దానం ఇచ్చేటప్పుడు ఆహారం లాంటివి ప్లాస్టిక్ పెట్టెలో పెట్టి ఇస్తూ ఉంటారు. ఇలా ఇవ్వడం తప్పు అని అంటున్నారు. ఎదుటి వారికి మనం ఇచ్చే దానం మంచి చేయాలి కానీ చెడు చేయకూడదు. ప్లాస్టిక్ ఆరోగ్యానికి హానికరం గనుక అది దానం ఇవ్వడానికి  పనికిరాదు.

 చీపురు:  మన ఇల్లు తుడుచుకునే చీపురును లక్ష్మీదేవి తో సమానంగా భావిస్తాం. ఎవరికైనా చీపురు దానం ఇస్తే వారి ఇంట్లో ఉండే లక్ష్మీదేవి బయటకు వెళ్లి పోతుంది అని నమ్ముతారు. ఎప్పటి నుంచో సంపాదించిన ధనం కరిగిపోయి పేదరికం వస్తుందని చీపురు దానంగా ఇవ్వకూడదని చెబుతారు. తరువాత వస్తువులు 

స్టీల్ : మన పురాణాలలో స్టీలు వస్తువులు దానంగా ఇవ్వండి అని ఎక్కడ  చెప్పలేదు. పండితులు కూడా స్టీల్ వస్తువులు దానంగా ఇవ్వద్దని చెబుతుంటారు.

పాతబట్టలు :  తర్వాత ఎవరికైనా సహాయం లో ఉన్నవారికి పాత బట్టలు ఇస్తూ ఉంటాం. ఇలా ఇవ్వడం మంచిదే కానీ మనం ఇచ్చే బట్టలు చిరిగినవి, రంధ్రాలు ఉన్నవి ఇవ్వకూడదు. మంచి బట్టలు మాత్రమే దానంగా ఇవ్వాలి.

  నూనెలు:  నూనెను ఎవరికీ ఎప్పుడూ దానమివ్వకూడదు. నూనె దానం ఇవ్వడం వలన శనీశ్వరుడిని స్వయంగా ఆహ్వానించినట్లు. అందుకే ఎవరికి దానంగా ఇవ్వకూడదని చెబుతారు. తర్వాత వస్తువులు

 పుల్లలు :  కట్టెపుల్లలు శుభసూచకం కాదు కనుక ఎవరికీ దానంగా ఇవ్వకూడదు. అలా ఇవ్వడం వలన ఇంట్లో అశుభం జరుగుతుందని నమ్ముతారు. 

కలం,పుస్తకం :  మనం రాసుకునే కలం పుస్తకం లాంటివి ఎప్పుడు ఎవరికైనా గిఫ్ట్ గా ఇవ్వాలి అనుకుంటే కొత్త పెన్ను, పుస్తకం మాత్రమే ఇవ్వాలి. మనం వాడిన వాటిని ఇవ్వడం వలన మన జ్ఞానాన్ని వేరొకరికి ఇచ్చినట్టు అవుతుంది లేదా విరిగిన పెన్నులు ఎవ్వరికి ఇవ్వకూడదు.  ఇంకా దానం ఇవ్వకూడని వస్తువులు లో చివరిది

 పదునైన వస్తువులు: పదునైన వస్తువులు  అంటే కత్తులు, కత్తెర వంటివి. వీటిని దానం ఇవ్వడం వలన ఇచ్చినవారికి, తీసుకున్న వారికి మధ్య అపార్ధాలు చోటుచేసుకుంటాయని పెద్దల నమ్మకం. అందుకే ఇప్పుడు చెప్పిన వస్తువులు ఏవి ఎవరికీ దానంగా ఇవ్వకండి.

Leave a Comment

error: Content is protected !!