Weight Loss Remedy at home

ఈమధ్య ఎక్కువగా వైరల్ అవుతున్న వెయిట్ లాస్ రెమిడి….. వారం రోజుల్లో ఎవరైనా రిజల్ట్స్ చూడాల్సిందే…………. ఫ్యాట్ కట్టర్ డ్రింక్…..

ఈ మధ్యకాలంలో అందరూ అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అధిక బరువు నుంచి విడుదల పొందడానికి ప్రస్తుత కాలంలో అందరూ ఎక్కువగా ఉపయోగిస్తున్న ఫ్యాట్ కట్టర్ డ్రింక్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ డ్రింక్ ని ఉపయోగించడం ద్వారా మనం వారం రోజుల్లోనే మంచి ఫలితాలు పొందవచ్చు. ఇందులో ఉపయోగించేవి అన్ని మన ఇంట్లో సర్వసాధారణంగా లభించేవి కనుక ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ డ్రింక్ ని రోజుకి ఒక్కసారి మాత్రమే తీసుకోవాలి.

               ఈ డ్రింక్ ను తయారు చేసుకోవడానికి ముందుగా మనకు కావాల్సింది ఏడు నిమ్మకాయలు. ఈ నిమ్మకాయలను ముందుగా రసం తీసుకుని నిమ్మరసం పక్కన పెట్టుకోవాలి. రసం పిండగా మిగిలిన నిమ్మ చెక్కలను పడేయకుండా ఈ రెమిడి కోసం ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఈ రెమిడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో 400 లేదా 500 ml నీటిని పోసుకోవాలి. అందులో నిమ్మ చెక్కలను వేసుకోవాలి. తర్వాత రెండు పెద్ద సైజు దాచిన చెక్కలను వేసుకోవాలి.

                         ఈ మిశ్రమం కొంచెం మరిగిన తర్వాత మనం ఉపయోగించే ఏదైనా కాఫీ పౌడర్ ను మూడు స్పూన్లు వేసుకోవాలి లేదా రెండు చిన్న ప్యాకెట్ల కాఫీ పౌడర్ వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక 20 నిమిషాల పాటు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఒక గాజు సీసాలోకి వాడ కట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని గోరువెచ్చగా అయిన తర్వాత అందులో మనం ముందుగా తీసుకున్న నిమ్మరసం వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని డైరెక్ట్ గా ఉపయోగించకూడదు. దీనిని నాలుగైదు రోజుల పాటు ఫ్రిజ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ డ్రింక్ ఉపయోగించాలో తెలుసుకుందాం.

                     దీనికోసం ఒక పెద్ద గ్లాస్ తీసుకొని అందులో ముప్పావు వంతు వేడి నీటిని వేసుకోవాలి. మిగిలిన పావు వంతు మనం తయారు చేసుకున్న ఫ్యాట్ కట్టర్ డ్రింక్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ తేనె కలుపుకోవాలి. ఈ డ్రింక్ ను రోజు పరగడుపున లేదా సాయంత్రం కాఫీ తాగే సమయంలో లేదా రాత్రి భోజనం చేసిన రెండు గంటల తర్వాత తీసుకోవాలి. ఇలా ఉపయోగించడం వలన నెల రోజులలో 10 కేజీల వరకు బరువు తగ్గవచ్చు.

Leave a Comment

error: Content is protected !!