weight loss tip with garlic

7 రోజుల్లో ఎంతటి వేలాడే పొట్ట,నడుం తొడలు,పిరుదుల చుట్టూ కొవ్వు ఐన మంచులా కరిగించేస్తుంది.. Belly fat

 అధిక బరువుకు సూచనగా మనలో కనిపించే మార్పు  బయటకు చొచ్చుకొచ్చిన పొట్ట. ఈ సమస్యకు ప్రధాన కారణం ఒకేచోట కూర్చుని పనిచేయడంతోపాటు అపసవ్యమైన తిండి అలవాట్లు. ఈ అలవాట్లతో శరీరం ఎలా తయారవుతుందంటే ఒంటిమీద చొక్కాను చీల్చుకుంటూ బయటకు వస్తానంటున్న పొట్టతో శరీరం నరకయాతన పడుతుంది. రూపమే కాదు ఆరోగ్యపరంగానూ పెరిగిపోయిన కొవ్వు అనేక సమస్యలు సృష్టిస్తుంది. మనం తినే జంక్ ఫుడ్ , నిల్వ ఆహారం సన్నగా ఉన్నవారిని కూడా రోజుల వ్యవధిలో అధికబరువుకు గురిచేస్తుంది. ఎలాంటి వేలాడే పొట్టనయినా మంచులా కరిగించే ఈ చిట్కాలు గురించి తెలుసుకుందాం. ముందుగా పొట్టను కరిగించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలుసుకుందాం. 

దీనికోసం ఉదయాన్నే గ్లాసుడు వేడినీరు తీసుకోవాలి. వేడినీరు చెడుకొవ్వును కరిగించడంతో పాటు శరీరానికి కావలసిన లవణాలను అందిస్తుంది. పరగడుపున వేడినీరు తాగడంవలన శరీరంలో మెటబాలిజం రేటు పెరగడంతో పాటు అంతర్గత అవయవాలన్నీ ఉత్తేజితం అవుతాయి. ఉదయం అల్పాహారం లో ఆయిల్ ఫుడ్ అసలు తీసుకోకూడదు. దానివలన శరీరంలో కొవ్వు పెరిగిపోతుంది. నూనె తక్కువ అవసరమయ్యే ఆహారం తీసుకోవాలి. పూరీ, వడ, పునుగులు వంటి డీప్ ఫ్రై చేసే పదార్థాలకు దూరంగా ఉండాలి. వీటిని వీలైనంత తక్కువ లేదా అసలు తీసుకోకపోవడం మంచిది. అధికపులుపు,కారం మసాలాలు తగ్గించాలి. ఇవన్ని ఎక్కువ తీసుకుంటే రక్తపోటు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఆహరాన్ని రోజు సరైన, ఒకే సమయానికి తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.

 ఇలా క్రమంపద్థతిలో తినడంవలన శరీరానికి శక్తి కూడా సక్రమమైన పద్థతిలో అందుతుంది. అప్పుడు కొవ్వులు శరీరంలో నిల్వ ఉండవు. రోజూ కొంతసమయం వ్యాయామం చేయాలి. వ్యాయామం అంటే జిమ్కే వెళ్ళాల్సిన పనిలేదు. రోజూ ఏదొక సమయంలో నడక, జాగింగ్, యోగాసనాలు చేయడం ద్వారా మంచులా కొవ్వు కరుగుతుంది. వీటితో పాటు ఈ చిట్కా ను కూడా పాటించాలి. ఏడు వెల్లుల్లి రేకులను తీసుకుని రోజుకి ఒకటి చొప్పున తినాలి. తర్వాత ఒక గ్లాసుడు వేడినీటిలో ఒక స్పూన్ తేనె తీసుకోవాలి. వెల్లుల్లిని తినేసి తర్వాత ఈ వేడినీటిని తాగాలి. దీనివలన మంచి ఫలితాలు చూస్తారు. లేకపోతే వేడినీటిలో ఒక స్పూన్ జీలకర్ర పొడి కలిపైనా తాగొచ్చు. వీటివలన పొట్ట,పిరుదులు, నడుము లో చేరుకున్న కొవ్వులు కరిగిస్తుంది. అంతేకాకుండా శరీరంలో పేరుకున్న టాక్సిన్లను బయటకు పంపడంలో సహకరిస్తుంది.

మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి

Leave a Comment

error: Content is protected !!