మనం ఎక్కువగా ఉపయోగించే కాయగూరల్లో సొరకాయ ఒకటి రుచితో పాటు అనేక పోషకాలు సొరకాయ సొంతం అయితే ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ సొరకాయ జ్యూస్ రూపంలో చేసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సొరకాయ విటమిన్ బి, విటమిన్ సి తోపాటు సోడియం ఐరన్ జింక్ పొటాషియం కలిగి ఉంటుంది. ఇది అధిక మొత్తంలో నీటి శాతాన్ని మరియు తక్కువ కొలెస్ట్రాల్ కలిగి ఉంటుంది. రెగ్యులర్ గా సొరకాయ జ్యూస్ తీసుకోవడం ద్వారా అనేక అద్భుత ఫలితాలను పొందవచ్చు. జ్యూస్ ఎలా చేసుకోవాలో ఈ కింది వీడియో చూడండి..
సొరకాయ ముక్కల్ని గ్రైండర్లో వేసి మెత్తగా చేసుకోవాలి తర్వాత సాల్ట్ జీరా పొడి మిరియాల పొడి పుదీనా ఆకులు వేసి బాగా మిక్స్ చేసి ఈ పానీయాన్ని తయారు చేసుకోవాలి. సొరకాయలు నీటి శాతం ఎక్కువ అందువల్ల ఇది చర్మాన్ని డీహైడ్రేషన్ బారినపడకుండా ఉంచుతుంది. ఇది చర్మానికి కావాల్సిన తేమను అందించి హెల్త్ మరియు గ్లౌయింగ్ మారుస్తుంది. తక్కువ ఫ్యాట్ ఉండే ఈ పానీయాన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వలన తేలికగా బరువును తగ్గించుకునేందుకు సహాయపడుతుంది. ఇది శరీరంలో ఏర్పడే వ్యర్థాలను తేలికగా బయటకు పంపడం వలన బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.
డయేరియాను నివారించడానికి సొరకాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో నీటి శాతం మరియు మినరల్స్ ఎక్కువ మొత్తంలో కలిగి ఉంటాయి. ఈ జ్యూస్ విరేచనాలను నివారించడంతో పాటు శరీరం కోల్పోయిన ఖనిజాలను భర్తీ చేస్తుంది. సొరకాయ గుండె ఆరోగ్యాన్ని పెంచే జింక్ కలిగి ఉంటుంది. ఇది శరీరంలోని రక్తసరఫరాను క్రమబద్ధీకరిస్తుంది అధిక రక్తపోటు సమస్యను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
రక్తహీనత సమస్య తో బాధపడేవారికి సొరకాయ జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుంది ఇందులో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. కంటిచూపును మెరుగుపరచే విటమిన్-ఎ సొరకాయలో పుష్కలంగా ఉంది. కంటిచూపు సమస్యలతో బాధపడే వారు క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు.
యూరినరీ మరియు మలబద్ధకం సమస్యలకు సొరకాయ ఒక తిరుగులేని ఔషధం అని చెప్పవచ్చు ఇది శరీరంలోని మలినాలను తేలికగా బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే పీచు మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. అంతేకాకుండా కండరాలకు బలాన్నిచ్చే కాల్షియం మెగ్నీషియం సొరకాయలు పుష్కలంగా ఉన్నాయి ఇవి మీ కండరాలను బలోపేతం చేస్తాయి.