weight-loss-with-cabbage

క్యాబేజీ తో.. ఫ్యాట్ బర్నింగ్ ఎలా?

ఇటీవల కాలంలో మనం ఎక్కడ చూసినా, అధిక బరువుతో, పెద్ద పెద్ద పొట్టలతో బాధపడేవారు కనిపిస్తున్నారు. ప్రతి ఒక్కరు బరువు తగ్గించే చికిత్సలు, ఇతర మార్గాలను అన్వేషిస్తుంటారు. ఇవన్ని తాత్కాలికమే. అయితే పొట్టలో కొవ్వును కరిగించే డ్రింక్స్, సూప్ లు ఇప్పుడు ఎంతో ప్రసిద్ధి అవుతున్నాయి.వీటిలోనే, క్యాబేజీ సూప్ కి మంచి రుచితో పాటు, కొవ్వు కరిగించే గుణాలు అత్యధికంగా ఉన్నాయి.ఫ్యాట్ బర్నింగ్ కెపాసిటీ ఉన్న ఈ సూప్ ని ఎలా చేయాలో తెలుసుకుందాం…

సూప్ కి కావాల్సిన పదార్ధాలు

  • సన్నగా తరిగిపెట్టుకున్న ఒక క్యాబేజ్
  • రెండు క్యారెట్స్ సన్నగా ముక్కలు చేసి పెట్టుకోవాలి.
  • రెండు ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి.
  • 1/2 tsp కార్న్ ఫ్లోర్
  • 1 tsp బ్లాక్ పెప్పర్ పౌడర్
  • రుచికి సరిపడ ఉప్పు
  • బటర్: 1 tsp

సూప్ చేసే విధానం

  • ముందుగా కడిగి పెట్టుకున్న వెజిటుబుల్స్ అన్నిటినీ ప్రెజర్ కుక్కర్ లో నీళ్ళు పోసి మరిగించాలి.
  • రెండు లేదా మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించి పెట్టుకోవాలి.
  • ఒక  ఫ్రైయింగ్ పాన్‌లో బటర్ వేసి అందులో వెజిటుబుల్స్’ని ఆ ఉడికిన నీరుని పోయాలి.
  • అందులో బ్లాక్ పెప్పర్ మరియు సాల్ట్  వేసి బాగా కలపాలి.
  • సూప్ చిక్కగా రావడం కోసం కొద్దిగా కార్న్ ఫ్లోర్’ని నీళ్ళలో కలిపి ఉండలు లేకుండా మిక్స్ చేయాలి.
  • అంతే పెప్పర్ అండ్ క్యాబేజ్ సూప్ రెడీ.

చివరి మాటా

ఈ సూప్ తాగితే శరీరంలో వేడి పెరిగి కొవ్వు కరుగుతుంది. అలానే దగ్గు, జలుబును నివారిస్తుంది.

Leave a Comment

error: Content is protected !!