అధికబరువు సమస్య అనేది ఈకాలంలో చాలా ఎక్కువైపోయింది. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అధిక బరువు సమస్యతో బాధపడుతున్నాడు. అధిక బరువును తగ్గించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినా ఫలితం ఉండదు. పౌష్టిక ఆహారం తీసుకుంటూ, వ్యాయామం చేస్తూ ఇప్పుడు చెప్పే డ్రింక్ తాగుతుంటే ఈజీగా అధికబరువు సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే జీర్ణక్రియ కూడా చాలా బాగా జరుగుతుంది.
చాలామంది బయట మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు.అలా వాడుతూ ఉండటం వల్ల తాత్కాలికంగా బరువు తగ్గిన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. మనం బరువు తగ్గాలి అనుకొన్నప్పుడు మంచి పౌష్టికాహారం తీసుకుంటూ ఇలాంటి చిట్కాలు పాటిస్తే త్వరగా బరువు తగ్గొచ్చు. ఇది తయారు చేయడం కూడా చాలా సులువు దీనికోసం మనం క్యారెట్ తీసుకుంటున్నాం. క్యారెట్ అన్ని సీజన్స్ లో మనకు అందుబాటులో ఉంటుంది. కొంతమంది పచ్చిగా తింటూ ఉంటారు. కొంతమంది జ్యూస్గా చేసుకుని తాగుతారు. శుభ్రంగా కడిగి చెక్కు తీసుకొని ముక్కలుగా చేయాలి.
క్యారెట్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. క్యారెట్ లో యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం,పాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. పోషకాహార నిపుణులు కూడా బరువు తగ్గడానికి క్యారెట్ జ్యూస్ పనిచేస్తుందని చెప్తారు. క్యారెట్లో విటమిన్స్ సమృద్ధిగా ఉంటాయి. క్యారెట్లో ఉండే విటమిన్ ఏ ఆహారం నుండి తీసుకుని శరీరం కెరోటినాయిడ్స్గా మార్చుకుంటుంది. కొవ్వు కణాలతో సంఘర్షణ చెంది కొత్తకణాలు పెరగకుండా అడ్డుకుంటుంది.
కొవ్వు కరగడానికి సహాయపడి కొత్త కొవ్వు పేరుకోకుండా సహాయపడుతుంది. క్యారెట్లో ఉండే పోలిక్ యాసిడ్, థయామిన్ జీర్ణక్రియ బాగా జరగడానికి సహాయ పడతాయి. జీర్ణ ప్రక్రియ బాగా జరిగితే తీసుకున్న ఆహారం కొవ్వుగా మారకుండా శక్తిగా మారుతుంది. క్యారెట్లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. అందులో అలాగే అల్లం బరువు తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి కూడా దోహదపడుతుంది. అల్లంలో ఉండే జింజరాల్ శరీర ప్రక్రియను నియంత్రణలో ఉంచుతాయి.
ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ప్రీరాడికల్స్ పోరాడతాయి. శరీరంలో అధికంగా పేరుకొన్న కొవ్వును కరిగించడంలో దోహదపడుతుంది. కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, అల్లం ముక్కలు నీళ్లు వేసి మిక్సీలో వేసి జ్యూస్ చేసుకోవాలి. దీని వడకట్టుకొని రసం తీసుకోవాలి. క్యారెట్ రసంలో అర చెక్క నిమ్మరసం పిండుకోవాలి. నిమ్మకాయ కూడా బరువు తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది.
ఈ జ్యూస్ జీర్ణప్రక్రియ మీద ప్రభావం చూపించి బాగా జరిగేలా చేస్తుంది. ఈ జ్యూస్ని ఉదయాన్నే పరగడుపున మరియు రాత్రి పడుకోవడానికి అరగంట ముందు తాగవచ్చు. ఈజ్యూస్ 15 రోజుల పాటు తీసుకోవడం వల్ల శరీరంలో తేడా మీకు స్పష్టంగా తెలుస్తుంది. తీసుకున్న మూడు పదార్థాలు సహజమైనవి గనుక బరువు తగ్గడంతో పాటు చర్మ ,జుట్టు సమస్యలు కూడా తగ్గుతాయి.