What are the things a woman should NOT do after getting married

పెళ్లయిన ఆడపిల్ల పుట్టింటి నుండి ఈ వస్తువులు అస్సలు తీసుకోకూడదు

పుట్టిల్లు అనగానే ప్రతి ఆడపిల్లకు అది తనది అని ఒక ఒక భావన. అక్కడకు వెళ్తే ఒక మనసులో ఒక నిశ్చింత, ధైర్యం దొరుకుతాయి. అమ్మగారి ఇంటికి వెళ్ళిన ప్రతి ఆడపిల్ల అక్కడ కొత్తగా కనిపించిన వస్తువులలో తనకు కావాల్సిన వాటిని మెట్టినింటికి తీసుకు వెళుతూ ఉంటుంది. ఇది ప్రతి ఆడపిల్ల చేసేదే. అయితే అలా తీసుకువెళ్లే వస్తువులలో కొన్నింటిని ఆడపిల్లలు తెలియకుండా అత్తవారింటికి తీసుకు వెళ్లడం వలన పుట్టింటికి అటు అత్తవారింటికి కూడా మంచిది కాదని చెబుతున్నారు. అలా తీసుకెళ్ళకూడని వస్తువులు ఏంటి? ఎందుకు తీసుకు వెళ్ళకూడదు? ఇప్పుడు తెలుసుకుందాం.

 చాలామంది అమ్మ గారి ఇంట్లో పూజ సామాగ్రి కొత్తది కనిపిస్తే నేను తీసుకు వెళతాను అని చెబుతారు. అయితే కనీసం ఒక్కసారి కూడా ఉపయోగించని వాటిని మాత్రమే ఆడపిల్లలు తీసుకెళ్లవచ్చు. అలాకాకుండా ఒకసారి దీపం పెట్టిన వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడపిల్లలకు ఇవ్వరాదు. మన ఇంట్లో దీపం పెట్టిన దీపపు కుందులు,  హారతి పళ్లెం వంటివి లక్ష్మీదేవితో సమానం. వాటిని ఇవ్వడం వలన లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది అని చెబుతున్నారు. అలాగే ఉప్పును కూడా లక్ష్మీదేవికి స్వరూపంగా భావిస్తారు. ఉప్పును ఎట్టి పరిస్థితుల్లోనూ పుట్టింటి నుండి తీసుకు వెళ్ళకూడదు. 

తరువాత చింతపండు, శీకాయ, కుంకుడు కాయ వంటివి కొబ్బరి, వంట నూనెలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకు వెళ్ళకూడదు. కేవలం అశుభ సమయాల్లో మాత్రమే శీకాయ, నూనె వంటివి పుట్టింటి నుండి పంపిస్తారు. కనుక ఎప్పుడు ఊరికనే తీసుకు వెళ్ళకూడదు .కావాలి అనుకుంటే కొంచెం డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం మంచిది. తరువాత ఇంట్లో కత్తెర్లు, కత్తులు, కూరగాయలు వంటివి కూడా పుట్టింటి నుండి తీసుకు వెళ్ళకూడదు. ముఖ్యంగా కాకరకాయలు, మెంతికూర వంటి చేదు కూరలు అసలు తీసుకెళ్లకూడదు. పుట్టింటి నుండి కేవలం తీపి మాత్రమే ఆడపిల్ల తీసుకువెళ్లాలి. 

చేదు పదార్థాలు అశుభానికి సూచనగా భావిస్తారు. తర్వాత ఇల్లు తుడిచె చేట, చీపురు కూడా లక్ష్మీదేవి స్వరూపం అని భావిస్తారు. కనుక వాటిని కూడా ఎప్పుడూ అమ్మగారి ఇంటి నుండి తీసుకు వెళ్ళకూడదు. ఇప్పటి కాలంలో చాలామంది తల్లులకు కూడా ఈ విషయాలు తెలియక ఆడపిల్ల అడిగిందని ఇస్తూ ఉంటారు. కానీ అది మంచిది కాదు. ఆడపిల్లకు ఏమి ఇవ్వకూడదో తెలుసుకొని వాటిని పాటించడం వలన ఇరు కుటుంబాలు ఆనందంగా ఉంటాయి.

Leave a Comment

error: Content is protected !!