What Happens When Sperm Comes Out With Urine

మూత్రంలో సుద్ద పడుతుందా?? కంగారుపడకండి. ఇలా చేసి చూడండి.

శరీరం అంతా నీరు పట్టడం, మూత్ర విసర్జనకు వెళ్లినపుడు మూత్రంలో తెల్లగా సుద్దలాంటి పదార్థం బయటకు పోతూ ఉండటం చాలామందిలో కనిపిస్తూ ఉంటుంది. ఇలా తెల్లగా పోతున్న సుద్ద మన శరీరంలో ప్రోటీన్ పదార్థమైన ఆల్బుమిన్.  ఇది యూరిన్ నుండి పోతుంది కాబట్టి దీన్నీ ప్రోటీనూరియా అని లేక అల్బుమినూరియా అని అంటుంటారు. రోజుకు నాలుగు గ్రాముల ప్రోటీన్ ఇలా మూత్రం నుండి వెళ్ళిపోతే శరీరంలో ప్రోటీన్ లోపం ఏర్పడి అనేక జబ్బులు కూడా కలుగుతాయి. కనురెప్పల మీద నీరు పట్టడం, కాళ్ళు చేతులు నీరు పట్టడం జరిగి మనిషి చాలా లావుగా తయారవుతారు. 

అయితే ఆయుర్వేదంలో ఈ అల్బుమినూరియా వ్యాధికి అనేక ఔషధాలు ఉన్నాయి. ఎవరికి వారు తేలికగా వాడుకోగలిగే కొన్ని పరిష్కారాలు మీకోసం.

◆కర్పూర శిలాజిత్ అనే ఔషధం అన్ని రకాల ఆయుర్వేద మందుల షాపుల్లో దొరుకుతుంది.  తెల్లటి పొడి రూపంలో ఇది ఉంటుంది. దీన్ని పావు చెంచా మోతాదులో తీసుకుని తగినంత పంచదార కలిపి తిని, వేడి పాలు తాగాలి. ఇలా చేయడం వల్ల మూత్రంలో మంట తగ్గి మూత్రం సాఫీగా వెళుతుంది. ముఖ్యంగా మూత్రంలో సుద్ద పడటం తగ్గిపోతుంది.

◆ కోడిగుడ్డు లోపలి తెల్లసొనకు మూత్రంలో సుద్ద పడటాన్ని తగ్గించే శక్తి ఉంది. అందుకే తెల్లసొనను పాలలో కలిపి తీసుకోవడం లేదా తెల్లసొనతో మాత్రమే ఆమ్లెట్ వేసుకోవడం కూరగా వండుకోవడం వంటి  వివిద రకాలుగా తెల్లసొనను తీసుకోవడం ద్వారా మూత్రంలో సుద్ద పడటాన్ని తగ్గించుకోవచ్చు.

◆ ఈ సమస్యకు కరక్కాయ అద్భుతమైన పరిష్కారాన్ని కలిగి ఉంది. కరక్కాయను పగలగొట్టి లోపలి గింజలు తీసివేసి, బెరడును మెత్తగా దంచి గాని, మిక్సీ వేసి గాని పొడిగా చేసుకోవాలి. దీన్ని జల్లించి సుతిమెత్తని పొడిగా చేసి నిల్వచేసుకోవాలి. ఈ పొడిని తేనెతో ఉదయం సాయంత్రం తీసుకుంటూ తీసుకున్న తరువాత పాలు తాగుతూ ఉంటే  మంచి ఫలితం కనబడుతుంది.

◆ ఉల్లిపాయలను ఆహారంలో బాగా వాడుతుంటే మూత్రంలో సుద్ద పడటం తగ్గిపోతుంది.

◆ సాధారణంగా బయట షాపుల్లో దొరికే పసుపును ప్యాకెట్లలో కొని కాకుండా పసుపుకొమ్ములు  తీసుకుని దంచి లేదా మరపట్టించి వాడుకోవడం వల్ల శరీరంలో నీటిని తగ్గించి మూత్రంలో సుద్ద పడటం తగ్గిస్తుంది. అలాగే పావు చెంచా మోతాదు పసుపును ఒక గ్లాస్ నీటిలో వేసి ఒక నిమిషం పాటు మరిగించి గోరువెచ్చగా అయ్యాక మరొక్కసారి బాగా కలిపి తాగుతూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. ఇలా రోజుకు రెండు సార్లు చేయవచ్చు.

◆ చిల్ల గింజలు అరగదీసి నీళ్లలో వేస్తే మురికి డుకు వెళ్లి స్వచ్ఛమైన నీరు పైకి తేలుతుంది. ఇదే విధంగా చిల్ల గింజలను కడుపుకు తీసుకున్నప్పుడు మూత్రంలో నుంచి బయటకు పోతున్న సుద్దను వడగట్టి మూత్రాన్ని మాత్రమే బయటకు పోయేలా చిల్ల గింజలు చేస్తాయి. అయితే చాలా కొద్ది మొత్తంలోనే వీటిని వినియోగించాలి. చిటికెడు చిల్ల గింజల గంధాన్ని వేడి పాలలో కలిపి  అందులో రెండు చిటికెళ్లు మిరియాల పొడి వేసి తాగితే గొప్ప ఫలితం ఉంటుంది.

◆ పల్లేరు కాయలు, కొండపిండి మొక్క, బార్లీ గింజలు, సబ్జా గింజలు ఇవన్నీ కూడా మూత్రాన్నీ సాఫీగా వెళ్లేలా చేస్తాయి. వీటిని బాగా వాడుతుంటే మూత్రంలో సుద్ద పడటం అనే సమస్య అసలు దరిచేరదు కూడా.

చివరగా……

మూత్రంలో సుద్ద రూపంలో కోల్పోయే పోషకాలను  పైన చెప్పుకున్న చిట్కాలను పాటించడం వల్ల నష్టపోకుండా చేసుకోవచ్చు. కాబట్టి సమస్య ఉన్నవారు తప్పనిసరిగా ఉపయోగించుకోండి.

Leave a Comment

error: Content is protected !!