మనం శరీరానికి అవసరమైన ప్రొటీన్ మాత్రమే తీసుకోవాలి. ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా దాని వల్ల నష్టమే తప్ప ప్రయోజనం ఉండదు. ఒక కేజీ చికెన్ తినడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోవడం తప్ప దాని వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. శరీరానికి ఎక్కువ ప్రోటీన్స్ లభిస్తాయని అన్నం తినకుండా కేజీ చికెన్ ఒకరే తినేస్తారు దీని వల్ల శరీరంలో కొవ్వు పేరుకుంటుంది అనేది నిజం. అలాగే కో కొంతమంది ఆహారం తీసుకోవడం మానేసి కేవలం వే ప్రోటీన్ డైరెక్టుగా తినేస్తుంటారు.
ఇలా తీసుకోవడం ప్రోటీన్ ముక్కలుగా విడగొట్టబడుతుంది.ప్రోటీన్ అంటే దానిలో కార్బన్, ఆక్సిజెన్, హైడ్రోజెన్ ఈ మూడు కలిపి కార్బోహైడ్రేట్.ఒక కార్బన్కి రెండు హైడ్రోజెన్లు ఒక ఆక్సిజెన్ కలిపితే అది కార్బోహైడ్రేట్. దీనికి నైట్రేట్ కలిస్తే అది ప్రోటీన్. ఒక కేజీ బరువు కి ఒక గ్రాము ప్రోటీన్ అవసరం అవుతుంది. అంటే ఒక మనిషి బరువు ఎన్ని కేజీలు ఐతే అన్ని గ్రాముల ప్రోటీన్ అవసరం అవుతుంది. మనం శరీరానికి అవసరమైన ప్రొటీన్ మాత్రమే తీసుకుంటే సరిపోతుంది.
దానికి మించి ప్రొటీన్ అవసరం పడదు. ఒకవేళ జిమ్ చేసేవారికి అయితే కొంచెం ఎక్కువ అవసరం అవుతుంది. వాళ్లు ప్రోటీన్ పౌడర్ రోజులో ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. అంతే తప్ప రోజంతా కేజీ ప్రోటీన్ పౌడర్ డబ్బా ఉదయం నుంచి సాయంత్రం వరకు తింటూ ఉండడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ప్రోటీన్ అతిగా తీసుకోవడం వల్ల మీ శరీరంలోకి వెళ్లి రెండు ముక్కలుగా విడగొట్ట బడుతుంది. విడగొట్టబడిన ప్రోటీన్లు నైట్రేట్ యూరియా రూపంలో బయటకు విసర్జింపబడుతుంది.
మిగిలిన సగభాగం కార్బోహైడ్రేట్ కొవ్వు రూపంలో శరీరంలో నిల్వ ఉంచబడుతుంది. మన శరీరంలో ప్రోటీన్ రూపంలో తీసుకొన్న పదార్థాలు ఆహారంగా నిల్వ ఉండకుండా కొవ్వు రూపంలో నిల్వ చేయబడతాయి. అందుకే ప్రోటీన్ పౌడర్ ను మోతాదుకు మించి తీసుకోకూడదు. మన శరీరానికి ఎంత అవసరమో అంత తీసుకుంటే సరిపోతుంది. ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం వలన కండలు రావు. ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం వలన ముక్కలుగా విడగొట్టబడి శరీరంలో కొవ్వుగా పేరుకుపోతుంది.
దీనివలన నష్టమే తప్ప ప్రయోజనం ఏమి ఉండదు. ఒక కేజీ స్వీట్ తిన్నా కేజీ ప్రోటీన్ పౌడర్ తిన్న మన అవసరానికి మించి ఉన్న ప్రోటీన్లు రెండు ముక్కలుగా విడగొట్టి బడి శరీరం నుంచి బయటకు విసర్జించబడతాయి. మిగిలినవి కొవ్వుగా మారతాయి.