స్త్రీలంటే దయ, కరుణ వంటి లక్షణాలతో ఉంటారని అందరికీ తెలిసిందే. కానీ ఈ మూడు రాశులకు చెందిన స్త్రీలు ముందు మాత్రం ఎంతటి మగవాడైన తలవంచాల్సిందే. ఎందుకంటే వీరు బలమైన సంకల్పంతో, దృఢమైన మనసుతో ఉంటారు. ఈ రాశి స్త్రీలతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వారు మీ భాగస్వామి అయినా, ఉద్యోగంలో తోటి ఉద్యోగిని అయినా, వ్యాపారంలో భాగస్వామిగా ఉన్నా, స్నేహితురాలు లేదా కుటుంబ సభ్యులు అయినా వీరితో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది.
వీరితో మాట్లాడినప్పుడు, ప్రవర్తించేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది. కొంతమంది మగవారికి స్త్రీలు తమపై పెత్తనం చేయడం నచ్చదు. కానీ ఈ స్త్రీలకు తగిన మర్యాద ఇవ్వకపోయినా, సరైన ప్రాముఖ్యత ఇవ్వలేదు అనిపించినా, చిన్నతనంగా చూసినా పరిస్థితులు తీవ్రంగా మారే అవకాశం ఉంటుంది. ఈ 3 రాశులలో మొదటి రాశి వారు మేష రాశి. ఈ రాశి స్త్రీలు ఎంతో ఉత్సాహంగా ఉంటారు మరియు ధృడమైన మనస్సును కలిగి ఉంటారు.
వీరు ఎవరినైనా ప్రభావితం చేయగలిగే శక్తిని కలిగి ఉంటారు. వీరిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఏ పని మొదలుపెట్టినా పూర్తి చేసే స్వభావం కలిగి ఉంటారు. వీరు తమ కింద పనిచేసే వారిని కూడా పని పూర్తయ్యేంతవరకు వదిలిపెట్టరు. ఎంతటి క్లిష్టమైన సమస్య అయినా పరిష్కరించగల సత్తా కలిగి ఉంటారు. అయితే వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి అధిపతి గురువు. వీరికి కోపం అధికంగా ఉన్నా ఎంతో సేపు ఉండదు. ఇక రెండవ రాసి వృశ్చిక రాశి.
వీరు కొద్దిగా పురుషులు వలె కఠినంగా ఉంటారు. స్త్రీలలో ఉండే సున్నితత్వం తక్కువగా ఉండి దయ, కరుణ , క్షమాగుణం తక్కువగా చూపిస్తారు. ఎలాంటి సమస్యకైనా శిక్ష విధించాల్సినదే అంటారు. ఇతర స్త్రీలకు భిన్నంగా ఉంటారు. వీరికి ఎదుటి వారిని అర్థం చేసుకోవడంలో చాలా తక్కువ సమయం పడుతుంది. స్నేహమైనా, ప్రేమైనా నిజాయితీగా ఉండాలి. అలా కాకుండా వీరిని మోసం చేసినా, చిన్నతనంగా చూసినా, అవమానించినా ప్రతీకారం తీర్చుకునేందుకు చూస్తారు. ఎదుటి వారు చేసే చిన్న చిన్న తప్పులను కూడా గుర్తు పెట్టుకొని వాటిని నిందిస్తూ ఉంటారు.
ఇక మూడవ రాశి వారు మకర రాశి. వీరు చూడటానికి శాంతంగా గంభీరంగా ఉంటారు. వీరికి పెద్దగా స్నేహితులు ఉండరు. వీరిని మాటల్లో పెట్టి పనులు చేయించుకోవాలని అనుకుంటే అస్సలు జరగదు. వీరికి మొండితనం, పట్టుదల ఎక్కువ. ఎవరు చెప్పినా వినరు. వీరి ముందు ఎంత బలవంతులైనా, ఎంత తెలివిగలవారైనా అణిగిమనిగి ఉండాల్సిందే. అలాగే మన పూర్వకాలంలో కొంత మంది స్త్రీలు ఎంతటి బలవంతులైన రాజులను కూడా తమ కన్నుసన్నల్లో మెలిగేలా చేసుకున్నారు. ఈ కాలంలో కూడా ఉద్యోగాల్లో లేదా ఏదైనా కార్యాలు నెరవేర్చడంలో పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా రాణిస్తున్నారు. వారు ఎక్కువగా ఈ రాశులకు చెందినవారు అయ్యి ఉంటారు.