ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారికి తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. దీనికి కారణం వాతావరణ పరిస్థితులు, సరైన ఆహారం తీసుకోకపోవడం, నిద్ర సరిగా లేకపోవడం, ఒత్తిడికి గురవడం మొదలగునవి. మనం తరచు బయటికి వెళుతూ ఉంటే వాతావరణంలో కాలుష్యం వలన జుట్టు తెల్లగా అవుతూ ఉంటుంది. సరైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే తెల్ల వెంట్రుకలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. అలాగే మనం తీసుకునే ఆహారంలో జుట్టు పెరుగుదలకు అవసరమైన ప్రోటీన్లు, విటమిన్లు అందే విధంగా సరైన ఆహారాన్ని తీసుకోవాలి.
రోజుకు 8 నుంచి 9 గంటల పాటు నిద్ర చాలా అవసరం. అలాగే పని ఒత్తిడి నుంచి కూడా రిలాక్స్ అవుతూ ఉండాలి. కొంతమందికి జెనిటిక్ కూడా తెల్ల వెంట్రుకలు వచ్చే అవకాశం ఉంటుంది. వారు వారానికి రెండు లేదా మూడు సార్లు హెన్న తెచ్చుకుని అప్లై చేసినట్లయితే తెల్ల వెంట్రుకలు తగ్గి జుట్టు నల్లగా అవుతుంది. హన్నా తెచ్చుకుని కలుపుకునే టైం లేదు అనుకున్నవాళ్ళు మార్కెట్లో హెన్నా పేస్ట్ కూడా దొరుకుతుంది. దానిని తెచ్చుకొని బౌల్ లో వేసుకుని ఒకసారి స్పూన్ తో కలిపి జుట్టుని పాయలు పాయలుగా విడదీసి అప్లై చేసుకోవాలి.
అప్లై చేసిన తర్వాత 40 నుంచి 50 నిమిషాలపాటు ఆరనివ్వాలి. తర్వాత ఇటువంటి షాంపూ ఉపయోగించకుండా నీటితో మాత్రమే కడిగేసుకోవాలి. ఇలా వారానికి మూడు సార్లు చేయడం వలన తెల్ల వెంట్రుకలు తగ్గుతాయి. జుట్టు సైనీగా, నల్లగా మెరుస్తుంది. ప్యాక్ అప్లై చేసుకొని ఉంచుకునే సమయం కూడా లేదు అనుకున్నవాళ్ళు మార్కెట్లో హెన్న హెయిర్ ఆయిల్ దొరుకుతుంది. ఈ ఆయిల్ జుట్టు కుదుళ్ల నుండి చివరి వరకు అప్లై చేయడం వలన కూడా వైట్ హెయిర్ తగ్గుతుంది.
ఇప్పుడు తెల్ల వెంట్రుకలు వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారికి వస్తుంది. కాబట్టి ఆహార నియమాలు పాటిస్తూ ఉండాలి. అలాగే జుట్టు విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు లేదా రెండు రోజులకు ఒకసారి ఏదో ఒక రూపంలో ఉసిరికాయ తీసుకోవాలి. ఉసిరికాయ లేదా ఉసిరికాయ జ్యూస్ లేదా వంటలలో కూడా ఉపయోగించుకోవచ్చు. ఉసిరికాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది ఇది తెల్ల వెంట్రుకలు తగ్గించి జుట్టు నల్లగా అవ్వడంలో సహాయపడుతుంది. మీరు కూడా తెల్ల వెంట్రుకలతో బాధపడుతున్నట్లయితే ఒకసారి ఈ చిట్కాలు రెండింటిని ట్రై చేయండి. తెల్ల వెంట్రుకలు పూర్తిగా మాయమైపోతాయి.