ఇప్పటి మనం ఉంటున్న వాతావరణ పరిస్థితులు, తినే ఆహారం, మన జీవనశైలి మార్పులు మన ఆరోగ్యాన్ని, అందాన్ని కూడా చాలా ప్రభావితం చేస్తున్నాయి. చిన్నవయసులోనే ముఖంపై ముడతలు, తెల్లజుట్టు లాంటి అనేక వృద్ధాప్య సమస్యలు మొదలవుతున్నాయి. ఈ సమస్యలు నుండి బయట పడడానికి మనకు ఆయుర్వేదంలో చాలా మార్గాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించి ఇప్పుడు తెల్లజుట్టు సమస్య నుండి బయటపడడం ఎలాగో తెలుసుకుందాం. దానికోసం మనం కొన్ని సహజ పదార్థాలు తీసుకోవాలి.
అవేంటంటే మొదట మనకు కావలసినవి మెంతులు. మెంతి విత్తనాలలో ఉండే ఔషధగుణాలు జుట్టుకు చాలా మేలు చేస్తాయి. తలలో చుండ్రును తగ్గించి జుట్టు మృదువుగా అయ్యేలా చేస్తాయి. ఈ చిట్కా తయారు చేయడం కోసం మెంతులను మెత్తటి పొడిలా చేసి ఒక స్పూన్ మెంతిపొడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
తర్వాత పదార్థం కలోంజి విత్తనాలు. నల్లగా సబ్జా విత్తనాలను పోలి ఉండే ఈ విత్తనాలు మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇవి జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడతాయి. కుదుళ్ళ నుండి ధృడంగా చేసి జుట్టును కాపాడతాయి. జుట్టు చివర్లో పగిలి, చిట్లి ఉన్న జుట్టును రిపేర్ చేయడంలో సహయపడతాయి.
తర్వాత తీసుకోవలసింది ఉసిరి పొడి. ఉసిరిని సౌందర్య చికిత్స కోసం పూర్వంనుండి అనేక ఆయుర్వేద చికిత్సల్లో ఉపయోగిస్తున్నారు. ఈ ఉసిరి జుట్టును బలంగా, నల్లగా ఉండేలా చేస్తుంది. తర్వాత ఇందులో కొన్ని చుక్కలు కొబ్బరినూనె కలపాలి. ఇది బాగా కలిసాక దీనిలో కొంచెం నీటిని కలిపి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. ఒక అరగంట తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి.
ఇలా క్రమం తప్పకుండా చేయడం వలన ఇప్పుడిప్పుడే నల్లజుట్టు తెల్లగా మారుతున్న వారిలో జుట్టు నల్లబడుతుంది. ఎంత ఎక్కువగా తెల్లజుట్టు ఉంటే అన్ని ఎక్కువ వారాలు ఈ మిశ్రమాన్ని ఉపయోగించాలి. మధ్యలో వదిలేయకుండా మంచి ఫలితాలు కోసం ఈ చిట్కా పాటించి చూడండి. అలాగే మన ఆహారం, జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులు కూడా మంచి ఫలితాలను చూపిస్తుంది.