Why-Alcohol-is-Bad-for-Health--Best-Food-For-Alcoholic

ఆల్కహాల్ తాగేవారికి బెస్ట్ ఫుడ్ ఇదే

ఈమధ్య మద్యం తాగడం అనేది ఆడవారిలో, మగవారిలో కూడా సర్వసాధారణం అయిపోయింది. నూటికి తొంభై మందికి ఈ అలవాటు ఉందిప్పుడు. అది బలహీనత, అలవాటుగా మారాక ఈ అలవాటు మానుకోలేరు. అప్పుడప్పుడు తాగడంవలన సమస్య ఏముంది అనుకుంటారు. ఈ అలవాటు మానిపించడం కాదు. మానకుండా కొనసాగిస్తున్న వారిలో, ఆరోగ్యం దెబ్బతినకుండా కొంత రక్షణ కలగడానికి ఆహరజాగ్రత్తలు తెలుసుకుందాం.

 ఆల్కహాల్ యొక్క ప్రభావం తగ్గడానికి సహాయపడే రెండు అలవాట్లు గురించి తెలుసుకుందాం. మొదటిది జ్యూస్లు తాగడం. రోజుకు రెండు పండ్లజ్యూస్లు తాగండి. వీలైతే రెండు పళ్ళరసాలు లేదా ఒకసారి వెజిటబుల్ జ్యూస్ తాగండి. వెజిటబుల్ జ్యూస్లో క్యారట్ వేస్తాం కదా. దానిలో ఉండే విటమిన్ ఏఆల్కహాల్ క్లీన్ చేయడానికి సహాయపడుతుంది. వెజిటబుల్ జ్యూస్లో కారట్, బీట్రూట్, కీరా, టమాటాలు వేసుకోవాలి. ఈ జ్యూస్ రోజుకి రెండొందల యాభై లేదా మూడొందల గ్రాముల జ్యూస్ తాగొచ్చు. ఇందులో తేనె, నిమ్మరసం కలుపుకుని తాగాలి. 

ఉదయం ఒక సారి అల్పాహారం కి ముందు తీసుకోండి. సాయంత్రం అల్పాహారానికి బదులు ఇంకొక జ్యూస్ తీసుకోవాలి. పండ్లరసాల్లో సిట్రస్ పండ్లు, కమలా, బత్తాయి అప్పుడప్పుడు దానిమ్మ జ్యూస్ తీసుకోండి. వీటిద్వారా సూక్ష్మ పోషకాలు బాగా శరీరంలోనికి వెళతాయి. లివర్ డీటాక్స్ చేయడానికి ఈ జ్యూస్లు చాలా బాగా పనిచేస్తాయి.  

రెండవ మంచి అలవాటు నట్స్ తినడం. తక్కువ ఖర్చులో నట్స్ అంటే గుమ్మడిగింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, పుచ్చకాయ గింజలు తీసుకోవాలి.వీటిని ఆరేడుగంటలు నానబెట్టి తినాలి. ఇవి చాలా బలవర్థక ఆహారం. వీటిలో ఎమీనో యాసిడ్స్, విటమిన్ ఈ, బి కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటాయి. కొంచెం ఖరీదైన పర్లేదంటే వాల్నట్స్, జీడిపప్పు అవీ తీసుకోవాలి. ఒక్కోరకం పది పదిహేను పప్పులు నానబెట్టి తినడం మంచిది. వీటితో పాటు రెండు రకాల పండ్లు తినండి. 

జామకాయలు, బొప్పాయి, తీసుకోవాలి. ఖర్బూజ చాలా మంచిది.మినరల్స్ అధికంగా ఉంటాయి కనుక ఇది కూడా తినవచ్చు. రోజూ మూడుపూటలా తీసుకునే భోజనానికి బదులు ఒకపూట నానబెట్టిన నట్స్, ఎండుఖర్జూరం తీసుకోవచ్చు. ఇందులో అనేక ప్రోటీన్లు, విటమిన్ ఏ, ఇ, బికాంప్లెక్స్, పోలిక్ యాసిడ్, జింక్ శరీరానికి దొరుకుతాయి. ఇవన్ని శరీరాన్ని  బాగా డీటాక్స్ చేసి లివర్ కిడ్నీలపై ఆల్కహాల్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడతాయి.

Leave a Comment

error: Content is protected !!