పసుపులో గల క్రిమిసంహారక శక్తి గురించి ఎన్నో తరాల నుంచి భారతీయులు గుర్తించారు. పసుపు ఆహారానికి రంగు రుచి సువాసన కలిగిస్తుంది. పసుపు పారణి మంగళ మైనవి. మన సంస్కృతిలో స్రీ సౌభాగ్యానికి, పసుపు ఉన్న ప్రాధాన్యత గొప్పది.
అనేక రకాల వ్యాధులను నయం చేస్తుంది.
పసుపు జీర్ణశక్తిని సరిచేస్తుంది. ఆకలిని పుట్టిస్తుంది. రోజు కుంకుమ గింజంత పసుపుని ఉండలాగా చేసుకొని నీటితో మింగితే సరిపోతుంది. శరీరంలో గల విష పదార్థాలను బయటకు వెళ్ళగొట్టే శక్తి పసుపులో ఉంది. అందువల్లే దీనిని ఆహారంలో వాడుతాం.
ఈ పసుపు కొమ్మును నిప్పులపై కాల్చి కొద్దిగా కాలిన పసుపు కొమ్ము నమిలితే పంటి నొప్పి తగ్గుతుంది. నోరు శుభ్రపడుతుంది. నోట్లో పుండ్లు ఉంటే తగ్గుతాయి.
పపసుపు కామెర్లకు దివ్యౌషధం
పసుపును కామెర్ల వ్యాధికి వాడతారు. కామెర్ల వ్యాధి లో కళ్ళు చర్మం మూత్రం అంతా పసుపు రంగులోనే ఉంటాయి. ఇది వ్యాధి లక్షణం కప్పు పాలల్లో ఒక పసుపుకొమ్ములు ముక్కలుగా చేసి బాగా మరిగించాలి. ఇలా మరగాపెట్టిన పాలను రోజు ఉదయం సాయంత్రం క్రమేణా తీసుకుంటుంటే కామెర్ల వ్యాధి తగ్గుతుంది. అంతేకాదు పసుపుకు నాలుగు రెట్లు పెరుగును కూడా కలిపి తీసుకుంటే తగ్గిపోతాయి.
దగ్గు జలుబును తగ్గిస్తుంది.
పసుపును నిప్పులపై వేసి పైన వచ్చే పొగను పిలుస్తుంటే తుమ్ములు రావడం, జలుబుతో ముక్కు నుండి నీరు కారడం లాంటి లక్షణాలన్నీ తగ్గుతాయి.
కాళ్ళు చేతులు చల్లబడి షాక్ కి గురైన రోగికి పసుపు పొడిని వెల్లుల్లిని మెత్తగా నూరి అరికాళ్లకు అరచేతులకు రాస్తే రోగి కోలుకుంటాడు. చల్లబడిన శరీరం వేడెక్కుతోంది.
- తెల్ల జుట్టు వచ్చింది కదా అని బయట దొరికే రకరకాల కలర్స్ వియోగిస్తాం కానీ ఒకసారి ఈ ప్యాక్ వేసి చూడండి
- 5 రూపాయలతో మీ స్కిన్ మీద ఉండే నల్ల మచ్చలు పోయి మీ స్కిన్ గ్లో గా మారుతుంది
చర్మ రోగాలను తగ్గిస్తుంది
పసుపు పొడిని వేడి నీళ్లలో కలిపి పుండ్లకు గజ్జి కురుపులకు కడుగుతూ ఉంటే అవి త్వరగా మానుతాయి. ఇది యాంటీసెప్టిక్బాగా పనిచేస్తుంది.
మడమ శూల అనేది ఒక వయసుకు వచ్చిన వారిలో చాలామందిలో వస్తుంది. ఈ సమస్యకు పసుపుపొడి చాలా బాగా పనిచేస్తుంది.
స్రీల నెలసరి సమస్యలని తగ్గిస్తుంది.
ఆడవారికి నెలసరి దోషాలన్నీ పసుపు తగ్గిస్తుంది. రోజూ ఐదు గ్రాములు మించకుండా పసుపును చిన్న చిన్న ఉండలుగా చేసుకుని వాడుకోవాలి. ఈవిధంగా నెలసరి అయినప్పుడు వాడుకుంటే ఇతర బాధలు కూడా పోతాయి.