ఈమధ్య ఎక్కువగా స్త్రీలలో నెలసరి సరిగ్గా రాకపోవడం, సంతానలేమి, హార్మోన్స్ డిస్టబెన్స్ ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలాంటి వారిలో ఓవరీస్ లో నీటి బుడగలు అంటే పిసిఒడీ సమస్య ఇలాంటి వాటి ఇబ్బంది తో పాటు ఆ బుడగలు కూడా చాక్లెట్ బుడగలు అంటే చాక్లెట్ సీస్ట్ లు కూడా కొంతమందికి వస్తూ బాధపడుతూ ఉంటారు. ఈ చాక్లెట్స్ సిస్ట్ లు అనేవి ఎందుకు వస్తాయి అంటే గర్భాశయం లోపల ఉండే పొర ని ఎండోమెట్రీయం పోర అంటారు. ఈ ఎండోమెట్రీయం పొర అనేది నెలసరి అయిన తర్వాత పెరగడం నెలసరి వచ్చిన తర్వాత బయటకు పోవడం జరుగుతుంది.
మళ్లీ కొత్త లేయర్ ఫార్మ్ అవ్వడం జరుగుతుంది. ఈ పొర యొక్క మందం ఎప్పటికప్పుడు పెరుగుతూ తగ్గుతూ వస్తుంది. ఇలా రుతుక్రమంలో జరుగుతుంది. ఇలా ఎండోమెట్రీయం లైనింగ్ అనేది పెరగడంతోపాటు గర్భాశయం వెలుపలకు కూడా వచ్చేసి ఓవరీస్ దగ్గరకు కూడా వెళ్ళిపోయి ఓవరీస్ లో కూడా ఎండోమెట్రీయం కణజాలం డెవలప్ అయిపోతూ ఉంటుంది. నెలసరి వచ్చినప్పుడు ఎండోమెట్రీయం పొర బయటికి రావాల్సి ఉంటుంది. ఈ కణాలు ఎక్కడ ఉన్నా వచ్చేసరికి బ్లీడింగ్ అవ్వడం దానికీ క్రమం. ఓవరీస్ నుంచి వచ్చే లిక్విడ్ ఏదైతే ఉంటుందో అది చాక్లెట్ కలర్ లో ఉంటుంది.
ఇలా చాక్లెట్ కలర్ లో ఓవరీస్ నుంచి బయటికి వచ్చే లిక్విడ్ నిదానంగా ఓవరీ రెండు నుంచి మూడు సెంటీమీటర్లలో మందంలో సీస్ట్ లాగా ఏర్పడతాయి. వీటి సైజు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇలాంటివి ఏర్పడిన అప్పుడు అల్ట్రా సౌండ్ స్కానింగ్ ద్వారానే బయటపడతాయి. ఇలాంటి చాక్లెట్ సీస్ట్ లు వచ్చినప్పుడు అవి తగ్గుతాయా అంటే ఇవి పూర్తిగా నార్మల్ అయ్యే అవకాశం ఉండదు. ఒక ఓవరీ బాగా ఉండి ఇంకొక ఓవరీకి వచ్చిన ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ లు ఒక 50% వరకు ఉంటుంది. కొంతమందికి ఎక్కువగా ఎఫెక్ట్ అయినప్పుడు 20% ఛాన్స్ ఉంటుంది.
ఈ చాక్లెట్ సీస్ట్ అయ్యి పెద్ద సైజులో ఉన్నప్పుడు నెలసరి సమయంలో నొప్పి ఎక్కువగా వస్తుంది. కనుక ఇవి చిన్న సైజులో ఉన్నప్పుడే మన జీవనశైలిలో మార్పు తెచ్చుకుంటే ఇవి స్ప్రెడ్ అవ్వకుండా తగ్గించుకోవచ్చు. కనుక ఇలాంటి లైఫ్ స్టైల్ డీసార్డర్స్ మన జీవన శైలిలో మార్పు తెచ్చుకోవడం తప్ప ఇంకొక అవకాశం లేదు