Wow One day skin whitening challenge

ఒకసారి యూస్ చేసే సరికి 100% రిజల్ట్

అందరు ఫేసియల్స్  కోసం బ్యూటీ పార్లర్ కి వెళ్తూ ఉంటారు. ఎంతలేదన్నా వెయ్యి రూపాయల పైన  2000 వరకు  ఛార్జ్ చేస్తారు. ఈజీగా ఇంట్లోనే ఎటువంటి ఖర్చు లేకుండా ఈ   ఈ ఫేసియల్   ట్రై చేసినట్లయితే100% రిజల్ట్ వస్తుంది.  ఏదైనా ఫంక్షన్కు లేక పార్టీకి వెళ్లాలనుకున్నప్పుడు పార్లర్ కు వెళ్ళే సమయం లేనప్పుడు ఈ చిట్కా  ట్రై చేసినట్లయితే మీ ముఖం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. ముందుగా ఫేసియల్  లో స్క్రబ్  ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. 

ఒక బొప్పాయి తీసుకుని పీల్ చేసి  సగం కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మిగతా సగం తీసుకొని  మిక్సీ జార్ లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.   ముందుగా స్క్రబ్బింగ్ కోసం   ఒక బౌల్ తీసుకొని రెండు   చెంచాల బొప్పాయి  పేస్ట్ తీసుకోవాలి.  దీనిలో రెండు చెంచాల బియ్యప్పిండి వేసి బాగా కలుపుకోవాలి. బియ్యప్పిండి బదులుగా పంచదార కూడా వేసుకోవచ్చు.    బియ్యప్పిండి స్కిన్ వైట్నింగ్ కోసం,  డెడ్ స్కిన్ సెల్స్, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్  రిమూవ్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. 

ఈ పేస్టుని ముఖానికి అప్లై చేసి ఐదు నుంచి పది నిమిషాల పాటు మృదువుగా మసాజ్ చేసుకోవాలి. తర్వాత నీటితో కడిగేయాలి. తర్వాత క్లీన్సెర్   ఒక బౌల్లో రెండు చెంచాల బొప్పాయి  వేస్ట్ తీసుకుని దానిలో ఒక చెంచా అలోవెరా జెల్ వేసి బాగా కలుపుకోవాలి. అలోవెరా వద్దు అనుకున్న వాళ్లు బాదం నూనె లేదా విటమిన్ ఈ క్యాప్సిల్స్ వేసుకోవచ్చు. ఈ రెండింటినీ బాగా కలిపి అప్లై చేసి పది నిమిషాల పాటు మసాజ్ చేయాలి. తర్వాత నీటితో కడిగేసుకోవాలి. 

తర్వాత ఫేస్ ప్యాక్ కోసం  ఒక  బౌల్ తీసుకొని రెండు చెంచాల బొప్పాయి పేస్టు వేసుకొని  దానిలో రెండు చెంచాల ముల్తానీ మట్టి వేసుకోవాలి  ముల్తాని మట్టి వద్దు అనుకున్న వారు శెనగపిండి లేదా గంధం పొడి ఉపయోగించవచ్చు.  ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి అప్లై చేసి పదిహేను నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి.  ఈ ఫేసియల్ ట్రై  చేసినట్లయితే మీ ముఖంపై ఉండే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్,డెడ్ స్కిన్ సెల్స్  పోయి ముఖం అందంగా,  కాంతివంతంగా తయారవుతుంది. సన్ టాన్ మొత్తం పోయి స్కిన్ క్లియర్ గా ఉంటుంది.

Leave a Comment

error: Content is protected !!