you must know facts about flax seeds

అవిశె గింజలను ఒకసారి ఇలా వాడి చూడండి అద్భుతాన్ని మీరే నమ్మలేకపోతారు.

మన ప్రాచీన ఆహారంలో గొప్పగా చెప్పుకోడానికి ఎన్నో వున్నాయి. వాటిలో అవిశె గింజలు కూడా ఒకటి. ఇవి సాంప్రదాయమైన ఆహారంలో భాగంగా విలసిల్లినవి. అయితే కాలం మారే కొద్దీ వీటి వాడకం కూడా తగ్గింది. కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఊరికే అనలేదు కదా, అందుకే ఇప్పటి ఆరోగ్య సమస్యలకు అవిశె గింజల వాడకం మళ్ళీ మొదలయ్యింది. శరీరం మొత్తం జబ్బుల దిబ్బగా తయారయ్యాక ఇలాంటి అనృత సమానమైన ఆహారాలను ఉపయోగించి మెల్లిగా కొలుకుంటున్నారు. ఇంతకు అవిశె గింజల్లో ఏముంది?? దాని ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?? ఒక్కసారి చూద్దాం రండి.

అవిశె గింజల్లో ఏముంది??

అవిశె గింజల్లో కార్బోహైడ్రేట్లు, గ్లూకోజ్, ఫైబర్, కొవ్వులు, ప్రోటీన్స్, విటమిన్ బి1, బి2, బి3, బి5, బి6 లు పుష్కలంగా ఉంటాయి అంతే కాదు విటమిన్ సి, కాల్షియం, పాస్పరస్,జింక్, మాంగనీస్ మొదలైనవి మెండుగా ఉంటాయి. ఇవన్నీ శరీరానికి బోలెడు ఆరోగ్యాన్ని చేకూర్చుతాయి.

Flax Seeds

◆ సాధారణంగా చాలా మందిని వేధించే సమస్య ఎముకలు బలంగా లేకపోవడం అలాగే ఎముకల అరుగుదల,  ఈ ఎముకలు అరిగిపోవడం వా కీళ్ల నొప్పులు కూడా తొడవుతాయి. అయితే అవిశె గింజల్లోని ఒమేగా ఆంటీ ఆక్సిడెంట్లు ఈ  సమస్యను నివారిస్తాయి.

◆ మనం ఆలోచించే నైపుణ్యాన్ని మెదడు వల్ల పొందగలుగుతున్నాం. అయితే మెదడు బలహీనంగాఉన్న సందర్బలలో అవిశె జనాలను ఆహారం గా తీసుకోవడం వల్ల మెదడు పనితీరు శక్తివంతం అవుతుంది. అవిశె గింజల్లోని ఫ్యాటీ యాసిడ్లు డిప్రెషన్ ను తగ్గిస్తాయి.

◆ అవిశె గింజల్లోని పీచు వల్ల జీర్ణశక్తి మెరుగు పడి మలబద్ధకాన్ని సులబంగా నివారిస్తుంది.

◆ అవిశె గింజల నుండి తీసే నూనెలో ఒమేగా-3, ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. అవిశె గింజల నూనెను ఆహారంలో ఉపయోగించడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగు పడి రక్త సరఫరాలో ఉన్న అడ్డంకులను తొలగిస్తుంది.

◆ అవిశె గింజల్లో లభ్యమయ్యే కొవ్వులు శరీరంలో గుండెకు ఎంతో మేలు చేస్తాయి.  చెడు కొవ్వును నిర్వీర్యం చేసి గుండెకు ఆరోగ్యాన్ని ఇచ్చే మంచి కొవ్వులను అవిశె గింజలు అందిస్తాయి. అందుకే గుండెకు మంచి చేస్తాయి.

◆ అవిశె గింజలను ఆహారం లో భాగం చేసుకోవడం వల్ల చెడు కొవ్వులు కరిగిపోయి శరీర బరువును తగ్గించడం లో అవిశె గింజలు తోడ్పడతాయి. 

చివరగా……..

మన ప్రాచీన సంస్కృతి మనకు అందించిన గొప్ప ఆహార సంపదలో అవిశె గింజలు కూడా చాలా ఉపయోగకారిగా పని చేస్తాయి. వీటితో లడ్డులు, చిరు తిళ్లు, కారం పొడి వంటి వెరైటీ లు  వండుకుని రోజు ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యం మీవెంటే…….

Leave a Comment

error: Content is protected !!