తెల్ల జుట్టు సమస్య ఈ మధ్యకాలంలో చిన్న వయసు వారిని కూడా చాలా బాగా ఇబ్బంది పెడుతుంది. ఎన్ని రకాలు కలర్లు, డైలు వాడిన ఈ సమస్య పెరుగుతుందే తప్ప తగ్గదు. దానికి తోడు కెమికల్స్ తో నిండిన డై వల్ల అనేక రకాల దుష్ప్రభావాలు వస్తుంటాయి. కొంతమందిలో ఎలర్జీలు, దురద, దద్దుర్లు వస్తుంటాయి. ఇంకొంత మందిలో ఈ డై లో ఉండే అమ్మోనియా వలన క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.
అందుకే వీలైనంతగా సహజంగా సమస్యను నివారించుకోవాలి. మనకి పురాతన కాలం నుండి అనుసరించే అనేక చిట్కాలు జుట్టు సమస్యలను తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంటాయి. అవేంటో వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. ఉసిరికాయలు దొరికే సీజన్ రాగానే వాటిని చిన్న ముక్కలుగా చేసి ఎండబెట్టి బాగా ఎండిన తరువాత పొడి చేసి పెట్టుకోవాలి. దీనిని సంవత్సరమంతా ఉపయోగించుకోవచ్చు.
ఫ్రెష్ గా వాడుకోవాలి అనుకున్నప్పుడు ఉసిరికాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక పాన్ లో వేసి నల్లగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా నల్లగా మారిన ఉసిరి ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఈ పొడిలో నాలుగైదు చుక్కల ఆలివ్ ఆయిల్ వేసుకొని తలకు అప్లై చేసుకోవాలి. ఆరిన తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేయడం వలన ఉసిరి గుణాలు తెల్ల జుట్టు సమస్యలను నివారించి కొత్తగా తెల్ల జుట్టు రాకుండా అడ్డుకుంటాయి.
ఆలివ్ ఆయిల్ జుట్టును తేమగా మార్చడంలోనూ జుట్టు నల్లగా, దృఢంగా ఉండేందుకు సహాయపడుతుంది. ఆలివ్ ఆయిల్ అందుబాటులో లేనివారు కొబ్బరినూనె కూడా వాడవచ్చు. ఇక రెండో చికిత్స కోసం ఒక గుప్పెడు కరివేపాకు తీసుకోవాలి. దీనిని రోట్లో కచ్చాపచ్చాగా దంచుకోవాలి. తరువాత ఒక గిన్నెలో ఈ కరివేపాకు వేసుకొని అది మునిగే వరకు కొబ్బరి నూనె వేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా ఎండ ఉన్నప్పుడు ఎండలో ఉంచాలి. తర్వాత రోజంతా అలానే వదిలేయాలి.
మరుసటి రోజు నుంచి తలకు అప్లై చేసుకోవాలి ఎండ లేనివారు డబుల్ బాయిలింగ్ పద్ధతి లో వేడి చేసుకోవాలి. అంటే ఒక గిన్నెలో వేడి నీళ్ళు తీసుకొని ఇంకో గిన్నెలో ఈ మిశ్రమాన్ని పెట్టి వేడి చేసుకోవాలి. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు తలకు అప్లై చేసుకోవడం వలన కుదుళ్ళలోకి వెళ్లి జుట్టును బలంగా దృఢంగా చేస్తుంది.
కరివేపాకు తెల్లజుట్టు సమస్యను తగ్గించడంలోనూ, జుట్టును బలంగా పొడవుగా పెరగడం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ నూనెను వారానికి రెండు సార్లు ఉపయోగించడం వలన చాలా మంచి ఉపయోగం ఉంటుంది. రాత్రిపూట ఉపయోగించి ఉదయాన్నే తలస్నానం చేయవచ్చు.